Friday, October 3, 2014

Lyrics of Bathukamma song : Chikkudu Vakitlo Uyyalo

చిక్కుడు వాకిట్లో ఉయ్యాలో .....సిరి సద్దులు కట్టి ఉయ్యాలో
పోదాము చిట్టూరి ఉయ్యాలో.....చుట్టాలు చూడ ఉయ్యాలో
ఆదేవరున్నారే ఉయ్యాలో.............అంబొజ్జ బంతి ఉయ్యాలో
అమ్మకు తముళ్ళు ఉయ్యాలో.....మనకే మామలు ఉయ్యాలో
బావ బామరుదులు కలిసి ఉయ్యాలో.............బావి తోడించే ఉయ్యాలో
బావిలో ఉన్నది ఉయ్యాలో......బంగారు బిందె ఉయ్యాలో
బిందెలో ఉన్నది ఉయ్యాలో..........పట్టే మంచము ఉయ్యాలో
పట్టే మంచము మీద ఉయ్యాలో...........తొండూరి పరుపు ఉయ్యాలో
తొండూరి పరుపు మీద ఉయ్యాలో.........ఇంద్రుని మెత్త  ఉయ్యాలో
ఇంద్రుని మెత్త మీద  ఉయ్యాలో.....శివుడొచ్చి ఊరెగీ  ఉయ్యాలో
శివుడి కాళ్ళ మీద  ఉయ్యాలో...........గౌరమ్మ గంగమ్మ  ఉయ్యాలో
గౌరమ్మ గంగమ్మ  ఉయ్యాలో.........గావ్వలాడంగా ఉయ్యాలో
అక్కడ మెరిసే ఉయ్యాలో............గుండం లా మెరిసే ఉయ్యాలో
గుండం లో నీళ్లన్నీ ఉయ్యాలో .......కుంకుమలాయె ఉయ్యాలో
కుంకుమ జోడించి ఉయ్యాలో.............కుప్పలే వోయించి ఉయ్యాలో
రాలిన కుంకుమ ఉయ్యాలో..............రచ్చలే వోయించి ఉయ్యాలో
మిగిలిన కుంకుమ ఉయ్యాలో...........మిద్దలే కట్టించి ఉయ్యాలో
మిద్దెల ఈరన్నకు ఉయ్యాలో..............ఏమేమి సొమ్ములు ఉయ్యాలో
కాకరకాయ కోయంగా ఉయ్యాలో.............కాళ్ళ కడియాలు ఉయ్యాలో
మునగకాయ కోయంగా ఉయ్యాలో........ముక్కుకు ముక్కెర ఉయ్యాలో
పెసరకాయ కోయంగా ఉయ్యాలో..........పెయినిండా సొమ్ములు ఉయ్యాలో

1 comment: